భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల భారత్-చైనా దేశాల సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద భీకర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిషేధించిన చైనా యాప్‌ల జాబితా ఇదే..