భారత్‌లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మార్చి 24 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ను ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతున్నది. లాక్ డౌన్ కారణంగా చాలా వరకు కరోనా వైరస్ ను అడ్డుకోగలిటినట్టు ప్రధాని మోడీ అన్నారు. అదే విధంగా ఏప్రిల్ 14 వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్ ను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సుముఖత ను వ్యక్తం చేసింది.
లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత జనం ఒక్కసారిగా రోడ్డు మీదకు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ ముఖ్యమంత్రులకు తెలిపారు. ఈరోజు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. లాక్‌డౌన్ తరువాత దేశంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి చర్చించారు. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే వాటి గురించి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు.