సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం విడుదలపై సస్పెన్స్ వీడింది. ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్ర విడుదలపై రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డుదే తుది నిర్ణయమని హైకోర్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాలు, రివ్యూ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత సెన్సార్‌బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం అనుకున్నట్లే డిసెంబరు 12న విడుదల కాబోతోందని వర్మ ట్వీట్ చేశారు. సెన్సార్ బోర్డు సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్‌ను షేర్ చేశారు.