HomeTelugu Trendingశ్రీలంకలో పేలుళ్లపై స్పందించిన సినీ ప్రముఖులు

శ్రీలంకలో పేలుళ్లపై స్పందించిన సినీ ప్రముఖులు

6 21వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 138 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

-ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది: ప్రకాశ్‌ రాజ్‌
– శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలిసి చాలా బాధపడ్డాను. లంక ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాను: విశాల్‌
– ఓ మై గాడ్‌. కొలంబోలోని సిన్నమన్‌ హోటల్‌ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను- రాధికా శరత్‌కుమార్‌
– ఈస్టర్‌ పర్వదినాన జరిగిన ఈ దాడిని చూసి గుండెపగిలిపోయింది: సుధీర్‌బాబు
– ఇది జరిగి ఉండకూడదు. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు ఎంత బాధపడుతున్నారో ఊహించడానికి కూడా భయంగా ఉంది. దేవుడా..కాపాడు: నివేదా థామస్‌
– ఈస్టర్‌ సండే ట్రాజెడీగా మారిపోయింది. రాక్షసులకు దయ అనేదే ఉండదు. బలహీన సమయాల్లోనే కుటుంబాలపై, పిల్లలపై దాడులు చేస్తుంటారు- సిద్ధార్థ్‌
– షాకింగ్.. బాధాకరం: సౌందర్య రజనీకాంత్‌
– శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం నిజంగా బాధాకరం. హింస అనేది ఓ చెయిన్‌ రియాక్షన్‌లా మారిపోయిందని ఎవ్వరూ గుర్తించకపోవడం దురదృష్టకరం. దీనికి ముగింపు పలకాలి: జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ (బాలీవుడ్‌ నటి)
– దాడుల గురించి షాకయ్యాను. ఈస్టర్‌ పర్వదినాన ఇలాంటి దాడికి పాల్పడినందుకు ఉగ్రవాదులు సిగ్గుపడాలి. బాధితులు తర్వగా కోలుకోవాలని, మృతుల కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేం మీతో ఉన్నాం శ్రీలంక. నిర్భయంగా ఉండండి: వివేక్‌ ఒబెరాయ్‌ (బాలీవుడ్‌ నటుడు)

Recent Articles English

Gallery

Recent Articles Telugu