HomeTelugu Big Stories2024 లో విడాకులతో షాక్ ఇచ్చిన Celebrity Couples ఎవరంటే!

2024 లో విడాకులతో షాక్ ఇచ్చిన Celebrity Couples ఎవరంటే!

Celebrity Couples who got divorced in 2024!
Celebrity Couples who got divorced in 2024!

Celebrity Couples Divorced in 2024:

2024లో దక్షిణ భారత ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతో చర్చనీయాంశంగా మారిన కొన్ని విడాకుల సంఘటనల్ని చూశాం. కొందరు తమ సంబంధాలను బహిరంగంగా ప్రకటించగా.. మరికొందరు మౌనంగా ఉండిపోయారు. ఎప్పుడూ ఆదర్శ జంటలుగా అందరికీ ఆదర్శంగా నిలిచిన వారు విడిపోవడం ఆశ్చర్యకరంగా మారింది.

1. జయం రవి – ఆర్తి రవి:

2009లో జయం రవి, ఆర్తి వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15 ఏళ్ల పెళ్లి బంధం తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు సెప్టెంబరులో ప్రకటించారు. అయితే, ఆర్తి ఈ నిర్ణయం గురించి తనతో ముందుగా మాట్లాడలేదని తెలిపారు. కొన్ని పుకార్లు జయం రవి ఓ గాయని డేటింగ్ చేస్తున్నాడని వస్తే, ఆ ముగ్గురు కూడా పుకార్లను కొట్టిపారేశారు.

2. జీవీ ప్రకాష్ కుమార్ – సైంధవి:

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, గాయని సైంధవి 2013లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ హైస్కూల్ నుంచే మొదలైంది. 2020లో వీరికి కూతురు జన్మించింది. అయితే 2024 మేలో 11 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ విడాకుల ప్రకటన ఇచ్చారు.

3. యువ రాజ్‌కుమార్ – శ్రీదేవి బైరప్ప:

కన్నడ నటుడు యువ రాజ్‌కుమార్, శ్రీదేవి 2019లో వివాహం చేసుకున్నారు. అన్ని సజావుగా ఉండడంతో సోషల్ మీడియాలో అందరూ వీరిని ఆదర్శ జంటగా గుర్తించారు. కానీ జూన్‌లో డొమెస్టిక్ వయోలెన్స్ కారణంగా ఈ జంట విడాకులు ఫైల్ చేశారు.

4. భామా – అరుణ్ జగదీష్:

మలయాళ నటి భామా, వ్యాపారవేత్త అరుణ్ జగదీష్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. మేలో వీరి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. అయితే భామా ‘సింగిల్ మదర్’ అనే పరోక్ష ప్రకటనతో ఈ వార్తలను నిజం చేసారు.

5. ఏఆర్ రెహమాన్ – సైరా బాను:

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా బాను 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. వారి విడాకులు 2024లో అందరికీ షాక్‌గా మారింది. వ్యక్తిగత జీవితం గురించి రెహమాన్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

ALSO READ: Revanth Reddy భోజనం ఖర్చు ఇన్ని లక్షలా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu