యంగ్ హీరో సుధీర్‌బాబు నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రంలో నభా నటేష్ కథానాయిక. ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించాడు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా ఇది. కాగా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా యూనిట్‌ను ప్రశంసించారు. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన చిత్రమిదని అన్నారు. వీరందరికీ సుధీర్‌బాబు తిరిగి ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్ బాబు: ‘నన్ను దోచుకుందువటే సినిమా గురించి గొప్ప విషయాలు విన్నా. నిర్మాతగా నీ తొలి సినిమా పట్ల గర్వంగా ఉంది సుధీర్‌బాబు. నువ్వు తెలివైన వాడివని మరోసారి విన్నా. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను బయట ఉన్నా.. మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తా. సినిమా చూడాలని ఆతృతగా ఉంది’ అన్నారు.
రానా: ‘ఈ సీజన్‌లో కుటుంబం, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’ గుడ్ లక్ సుధీర్ బాబు’.
హరీష్ శంకర్: ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో సూపర్ కూల్ వారాంతం ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితుల్ని, భావోద్వేగాలతో చూపించారు. సుధీర్‌బాబు నటన చక్కగా ఉంటుంది. నభా నటేష్ సర్‌ప్రైజ్ చేస్తారు. ఆర్.ఎస్. నాయుడికి కుడోస్’
ఇంద్రగంటి మోహన కృష్ణ: ‘నన్ను దోచుకుందువటే’ హృదయాన్ని తాకే నిజాయతీ సినిమా. సుధీర్‌బాబు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నభా నటేష్ చక్కగా నటించారు. మిగిలిన చిత్ర బృందం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఫన్నీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. వెళ్లి సినిమా చూడండి’
అడివి శేష్: ‘నన్ను దోచుకుందువటే’ ఓ చక్కటి వినోదాత్మక చిత్రం. సుధీర్‌బాబు, నభా నటేష్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా నచ్చింది. సిరి పాత్రను సరదాగా అమాయకత్వం కలిపి దర్శకుడు రచించారు. నిర్మాతగా తొలి సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబుకు కుడోస్.
Hearing great things about Nannu Dochukunduvate. Happy and proud of your first production venture 👏👏👏 @isudheerbabu heard you are brilliant. Congratulations to the entire team 👍👍
Am travelling… back in a couple of days… Can't wait to catch it..😊— Mahesh Babu (@urstrulyMahesh) September 21, 2018
#NannuDochukunduvate is a must watch in this season with your friends & family. Good luck
brother @isudheerbabu on the big day today!!— Rana Daggubati (@RanaDaggubati) September 21, 2018