HomeTelugu Trendingవిశాఖ గ్యాస్‌ లీక్ పై సీనీ ప్రముఖుల స్పందన..

విశాఖ గ్యాస్‌ లీక్ పై సీనీ ప్రముఖుల స్పందన..

8 6
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా మహామ్మారి కారణంగా మన దేశంలో వేల మంది మరణించారు. ఈ నేపధ్యంలో ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారుజామున పరిశ్రమను తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం దాదాపు 1500 ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అక్కడి ప్రజలందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం 180 మంది కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మందిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనే సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపాటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేసారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు అండగా నిలుస్తామని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం హామి ఇచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసారు.

ఈ ఘటనపై చిరంజీవి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్,మంచు మనోజ్, సందీప్ కిషన్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, సుధీర్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, సునీల్, శ్రీకాంత్, నాని, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్ధార్ధ్‌తో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, సురేందర్ రెడ్డి, మారుతి సహా పలువురు నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu