HomeTelugu Big Stories'తార'ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘తార’ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

3నూతన సంవత్సరం ‘2019’లోకి అడుగుపెట్టేశాం. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఇక సినీ ప్రముఖుల ఇళ్లలో వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూఇయర్‌ సందర్భంగా అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్‌ తెలుపుతూ తమ కుటుంబీకులు, స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటున్నారు.

కొత్త ఏడాది..కొత్త సంతోషాలు..జీవితానికి ఇది కొత్త ప్రయాణం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు- అమితాబ్‌ బచ్చన్‌
డియర్‌ 2018.. నువ్వు నాకు ప్రత్యేక ఏడాదిగా నిలిచిపోతావు. నాకు రెండు ప్రత్యేక సినిమాల్లో నటించే అవకాశం కల్పించావు- త్రిష
2019..నీకోసమే ఎదురుచూస్తున్నా- నివేదా థామస్‌
ఏదన్నా సాధించాలన్న తపన, దాన్ని నెరవేర్చుకోవడానికి మనం పడే కష్టంతోనే మనకు విజయం వరిస్తుంది. మీ కలలను సాకారం చేసుకోండి. నేను పోస్ట్‌ చేసిన ఈ వీడియో మీకు జీవితంలో ఏదన్నా సాధించాలన్న నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తే నేనెంతో సంతోషిస్తాను. హ్యాపీ న్యూఇయర్‌. ఈ ఏడాదిలో ఎంత సాధించగలుగుతారో అంత సాధించేయండి.- సుధీర్‌ బాబు
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019 మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కలలను నిజం చేసుకోండి. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు.- కోన వెంకట్‌
కొత్త ఏడాదిలో వచ్చిన తొలి సూర్యోదయ దృశ్యాన్ని మీతో పంచుకుంటున్నాను. హ్యాపీ న్యూఇయర్‌- అక్షయ్‌ కుమార్
కొత్త సంవత్సరం అంటే.. పుస్తకంలో మొదలుపెట్టాల్సిన మొదటి చాప్టర్‌లాంటిది. కాబట్టి దానిని అందంగా రాసుకోండి. ఎలాంటి భయంలేకుండా, మీ మనసులో ఉన్న భావాలన్నీ రాయండి. మిమ్మల్ని వెనక్కిలాగుతున్న అంశాల నుంచి బయటపడండి- కృతిసనన్‌
హ్యాపీ న్యూఇయర్‌. మీకు మీరు విలువనిచ్చుకోండి. 2018 ఎంతో అందంగా గడిచిపోయింది. నాకు మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చాలా ప్రయాణించాను. కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. ఇంతకంటే ఏం కావాలి?- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు- కల్యాణ్‌రామ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu