ఎడిటర్ గౌతమ్‌రాజు మృతిపై డైలాగ్ కింగ్ మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. ఎడిటర్ గౌతమ్‌రాజు నాకు అత్యంత ఆత్మీయుడు. నా సొంత బ్యానర్‌లో ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అతను మంచి మనిషి, అతని బిడ్డలు మన స్కూల్లో చదువుకున్నారు. అతని మరణవార్త నా మనసును కలిచివేసింది అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మోహన్‌బాబు వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో గౌతమ్‌రాజు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. గౌతమ్ రాజు కన్నుమూయడం విచారకరమన్నారు. ఎడిటర్‌గా వందల చిత్రాలకు పని చేసిన ఆయన అనుభవశాలి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
గౌతమ్ రాజు ఎంతో అద్భుతమైన ప్రతిభ కలిగిన ఎడిటర్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు ఎంతో ఆత్మీయులని, మృధుస్వభావి అని అన్నారు. ఆయనతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలకు కలిసి పని చేసినట్లు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో గౌతమ్‌రాజుది ఒక ప్రత్యేకమైన స్థానమని అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.