HomeTelugu Big Storiesమాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు..

మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు..

4 9
మాతృదినోత్సవం సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మలతో తమకున్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి: ‘మన కథలన్నింటి వెనుక అమ్మ కథ ఉంటుంది.. ఎందుకంటే మన ప్రయాణం ఆమె నుంచే ప్రారంభమవుతుంది. ఎన్నో మధురజ్ఞాపకాలు..’ అంటూ తన అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మహేశ్‌ బాబు: నా జీవితంలోని ఇద్దరు మార్గదర్శకులకు, ప్రపంచం మొత్తం మీద ఉన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు’

మంచు మనోజ్: ‘అమ్మ.. నువ్వు నాపై చూపించే ప్రేమాభిమానులు నా జీవితంలో ఎప్పటికీ మారవు. ఈ ప్రపంచంలోకెల్లా అద్భుతమైన అమ్మగా ఉన్నందుకు ధన్యవాదాలు. భూమ్మీద ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్‌ డే’ అని అంటున్నారు ‌. ఆదివారం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు అమ్మలతో తమకున్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

అల్లు అర్జున్‌: ఉన్నత శిఖరాలకు వెళ్లినా సరే ఒదిగి ఉండాలనే గొప్ప విషయాన్ని మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. హ్యాపీ మదర్స్‌ డే అమ్మ’

కాజల్‌: ‘జీవితంలోని ఎన్నో విషయాలకు నాకు ఉదాహరణగా ఉంటూ, నన్ను ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తున్న మా అమ్మకు మదర్స్‌డే శుభాకాంక్షలు’

నాగశౌర్య: ‘మదర్స్‌ డే సందర్భంగా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి మా అమ్మకు మనస్ఫూర్తిగా కృజ్ఞతలు తెలుపుతున్నాను. మా డార్లింగ్‌ అమ్మతోపాటు అందరి అమ్మలకు హ్యాపీ మదర్స్‌ డే. ఇది వాళ్ల రోజు కాబట్టి ఈరోజు వాళ్లకి ప్రత్యేకం గా ఉండేలా చేయండి’

Recent Articles English

Gallery

Recent Articles Telugu