బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించిన తెలుగుతేజం పీవీ సింధును సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆమె నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మోహన్‌బాబు, నాగార్జున, విజయ్ దేవరకొండ, అనుష్క శర్మ, అనుపమ్ ఖేర్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితరులు అభినందనలు చెప్పిన వారిలో ఉన్నారు. ‘చక్కగా ఆడావు సింధు. నీ పట్ల గర్వంగా ఉంది’ అని ప్రముఖ గాయని ఆశా భోంస్లే ట్వీట్ చేశారు.
మోహన్‌బాబు: ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన ప్రియమైన సింధుకు అభినందనలు. మరోసారి మన దేశం గర్వించేలా చేశావు.
నాగార్జున: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి భారత్‌కు బంగారు పతకం తీసుకొచ్చిన గోపీచంద్, సింధుకు శుభాకాంక్షలు.
విజయ్ దేవరకొండ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి భారత మహిళ. కంగ్రాట్స్ ఛాంపియన్. మేం గర్వించేలా చేశావు.
అనుష్క శర్మ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న మొదటి భారత మహిళ సింధు. అద్భుతంగా ఆడావు. శుభాకాంక్షలు.
మంచు విష్ణు: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలుపొందిన సింధుకు అభినందనలు. సూపర్.
రకుల్‌ప్రీత్ సింగ్: శుభాకాంక్షలు సింధు. నువ్వు దేశంలోని ప్రజలకు స్ఫూర్తిదాయకం. నీ పట్ల చాలా గర్వంగా ఉంది. నువ్వు మేం గర్వించేలా చేశావు.
రాశీ ఖన్నా: సింధు అంకితభావం, శ్రమ స్ఫూర్తిదాయకం. ఇది మేమంతా గర్వించే తరుణం.
సానియా మీర్జా: నువ్వు ఓ గొప్ప క్రీడాకారిణివి సింధు. శుభాకాంక్షలు. ఈ మూమెంట్‌ను ఎంజాయ్ చెయ్.
సైనా నెహ్వాల్: మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న సింధుకు హృదయపూర్వక అభినందనలు.
మాధవన్: సింధు జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై గెలుపొందింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. నీ పట్ల గర్వంగా ఉన్నాం.
సుధీర్‌బాబు: శుభాకాంక్షలు సింధు. నీ విజయం తర్వాత వినిపించిన మన దేశ జాతీయ గీతం కోసం ప్రతి భారతీయుడు కలలు కన్నాడు. గర్వంగా ఉంది.
ఛార్మి: సింధు ఓ ఆడపులి.. గొప్ప దూకుడు. శుభాకాంక్షలు.
అనుపమ్ ఖేర్: ప్రియమైన సింధుకు అభినందనలు. నీ విజయంతో భారతదేశం గర్వపడుతోంది. నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. జైహింద్.
హరీష్ శంకర్: చరిత్ర సృష్టించిన సింధుకు శుభాకాంక్షలు. మేం గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు.
గోపీ మోహన్: శుభాకాంక్షలు సింధు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి మహిళ తను కావడం సంతోషంగా ఉంది. యువతకు నువ్వు ఆదర్శం.
మొత్తం దేశం నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.
ప్రణీత: వావ్.. శుభాకాంక్షలు సింధు.