బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఇద్దరు సైకియాట్రిస్టులు ముంబై పోలీసులకు పలు కీలక విషయాలు వెల్లడించారు. సుశాంత్ తరచూ డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలతో బాధపడినట్లు తెలిపారు. సుశాంత్ మందులు మానేయడంతోనే సమస్యలు పెరిగినట్లు ట్రీట్ మెంట్ చేయడం కష్టమైందని చెప్తున్నారు. తనకు ఉన్న బైపోలార్ డిజార్డర్ సమస్య నుంచి బయటపడలేనని, తన వల్ల తన ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుందని సుశాంత్ బాధపడేవాడని ఒక సైకియాట్రిస్ట్ చెప్పారు.
మెంటల్ డిజార్డర్ల వల్ల సుశాంత్ కు ఆకలి, నిద్ర కూడా సరిగ్గా ఉండేవి కావని తెలిపారు. మందులను ఆపేయడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుందని, సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సుశాంత్ సింగ్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు డాక్టర్ల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సుశాంత్ కేసుతో సంబంధం ఉన్న ఓ డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో జైద్ విలత్రా అనే డ్రగ్ డీలర్ ను ముంబైలోని ఓ కోర్టు గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీకి అప్పగించింది. అతడికి ఈ నెల 9 వరకు రిమాండ్ విధించింది.