నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టాలీష్ స్టార్ అల్లు అర్జున్, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించనుంది. అయితే మరో కీలక పాత్రలో కేథరిన్ థ్రెస్సా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో బన్నీతో ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, రుద్రమదేవి సినిమాలో కలిసి నటించింది కేథరిన్. త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు.