స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూరీజగన్నాద్ కాంబినేషన్‌లో తెరక్కెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్ ట్రెసా. ఈ అమ్మడు గ్లామర్ పరంగా మెప్పించిన ఎందుకనో తెలుగులో అనుకున్ననని అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ‘మెడ్రాస్’ అనే సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు తమిళ, తెలుగు, కన్నడ , మలయాళ సినిమాల్లో నటించింది. చివరకు అందాల ఆరబోతకు కూడా ఈ అమ్మడు సై అంటున్నప్పటికీ.. ఆఫర్లు మాత్రం రావడం లేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఈ హాట్ బ్యూటీ. సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు అన్న ప్రశ్నకు. ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా కనిపించమనే దానికంటే కాదు.. నా నటన సినిమాకు ఎంతవరకు ప్లెస్ అవుతుందన్నదే నాకు ముఖ్యం అని చెప్పింది. ఇక పెళ్లి పై ప్రస్తావిస్తూపై స్పందిస్తు.. వరుడు లభిస్తే తాను పెళ్లికి రెడీ అని, సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఇంట్లో కూడా పెళ్లి విషయంలో తన పై ఒత్తిడి ఉందని అంటుంది క్యాథరిన్.