బాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ (28) మృతి చెందాడు. మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ముంబైలో తుదిశ్వాస విడిచినట్టు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు వచ్చిన వార్తలను ఆయన మేనమామ సునీల్ భల్లా ఖండించారు. బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్న క్రిష్ కపూర్ సబర్బన్ మీరా రోడ్డులోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని బుధవారం తెలిపారు. క్రిష్ కపూర్ తన తల్లి, భార్య, ఏడేళ్ల పాపతో కలిసి జీవిస్తున్నాడు. మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’ వంటి సినిమాలకు క్రిష్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.