Case Registered On Allu Arjun: ఏపీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఎన్నికల ప్రచారల్లో అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఈరోజు అనుహ్యంగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి విజయం కోసం అల్లు అర్జున్‌ని రంగంలోకి దిగాడు. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి కర్నూలుకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.
ఆయనకు అక్కడి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
కిక్కిరిసిన అభిమానులు, జనసందోహం మధ్య ఇంటిలోకి చేరుకొన్నారు. తనకు రవిచంద్ర రెడ్డి ముందు నుంచే పరిచయమని గతంలో ఎన్నో సార్లు కలుస్తూ ఉండే వాళ్ళం కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కలుస్తున్నాడని కష్టపడి పని చేస్తున్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఏమిటి? అంటూ అల్లు అర్జున్ తన స్నేహితుడిని గెలిపించమని కోరారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా జన సందోహం అల్లు అర్జున్ ని చూసేందుకు కదలి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయితే తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఏపీలో వైసీపీకి మద్దతు ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్న మొదలైంది. అయితే ఐకాన్ స్టార్ తీసుకొన్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓపెన్‌గానే విమర్శలు గుప్పిస్తున్నారు.