HomeTelugu Big Storiesపుష్ప: సమంత ఐటమ్‌ సాంగ్‌పై కేసు

పుష్ప: సమంత ఐటమ్‌ సాంగ్‌పై కేసు

Case filed 1
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’. కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబరు 17న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా ఈ సినిమాలో స్టార్‌హీరోయిన్‌ సమంత ఐటం సాంగ్‌ చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ‘ఊ అంటావా మావా ఉఊ అంటావా’ సౌత్ లో టాప్ లేపేస్తోంది. కానీ మరో వర్గం మాత్రం ఈ సాంగ్ లోని లిరిక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత చేసిన ఈ సాంగ్ పై, అందులో లిరిక్స్ పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Case filed on samantha item

ఇంతకుముందు మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో ఓ సన్నివేశం అభ్యంతరకరంగా ఉందంటూ కామెంట్స్ చేసిన సమంత ఇప్పుడు పురుషులను కించపరిచేలా ఉన్న ఈ సాంగ్ లో ఎలా చేసింది ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు మెన్స్ అసోసియేషన్ అంటూ కొంతమంది కేసు కూడా నమోదు చేశారని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోవడంతో సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఐటెం సాంగ్ కోసం సమంత ప్రత్యేకంగా కనిపించింది. తమిళంలో వివేక, తెలుగులో చంద్రబోస్ ఈ సాంగ్ కు లిరిక్స్ రాశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu