నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు నమోదు అయింది. గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్ల సందర్భంగా ‘మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి.. ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం’ నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్ గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది.. అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మా గౌరవాన్ని , మా వృత్తి ని అవమానించుతు మాట్లాడారు.
గొర్రెలు కాసుకునే వాళ్ళు చూస్తుంటే సినీతారల గౌరవం పోతుందన్నట్టు అర్థం వచ్చేలా గొర్లకాపరులను కించపరిచేలా మోహన్ బాబు గారు వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. కావున గొర్రెలకాపరులు కించపర్చేలా మాట్లాడిన మోహన్ బాబు గారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.