HomeTelugu Big Storiesఅనంత శ్రీరామ్‌పై కేసు నమోదు

అనంత శ్రీరామ్‌పై కేసు నమోదు

Case filed on lyricist anan

ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదయింది. ఇటీవలే నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ మూవీ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘దిగు దిగు దిగు నాగ’ అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలు నాగదేవత కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారని ఆరోపిస్తున్నారు. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి అనంత శ్రీరామ్ పై కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయం పై చిత్ర యూనిట్, శ్రీరామ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు యూట్యూబ్ లో ఈ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu