జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి కేసు నమోదు చేశారు. దీనికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు ఖచ్చితంగా జాతీయ గీతం ఆలపించాలంటూ.. తీర్పునిచ్చింది.
అయితే ఈ తీర్పు పట్ల పవన్ కల్యాణ్ తన స్పందనను తెలియజేయడం వలన ఆయన జాతీయ గీతాన్ని అవమానించారంటూ.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా థియేటర్లు దేశభక్తిని నిరూపించేందుకు పరీక్షా కేంద్రాలుగా మారాయని.. పోలిటికల్ పార్టీ మీటింగ్స్ మాత్రం జాతీయగీతంతో ఎందుకు మొదలుపెట్టట్లేదని పవన్ తన ట్విటర్ లో పోస్ట్ ను పెట్టారు.
దీంతో పవన్ జాతీయ గీతానికి వ్యతిరేకంగా.. ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని జనార్ధన్ రెడ్డి తన కంప్లైంట్ లో పేర్కొన్నారు.