మధురైకి చెందిన కదిరేశన్ దంపతులు ధనుష్ మా బిడ్డ అని కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నడుస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు ఆధారాలు అన్నీ కదిరేశన్ దంపతులకు అనుకూలంగా ఉన్నాయి. ధనుష్ చిన్నప్పటి ఫోటోలు కస్తూరి రాజా ఇవ్వలేకపోవడం, జెరాక్స్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడం, ధనుష్ పుట్టు మచ్చలు లేజర్ తో తొలగించారని రుజువవ్వడం వంటి విషయాలు ధనుష్ కి వ్యతిరేకంగా మారాయి. అయితే ఇప్పుడు మరో విషయం ధనుష్
నిజంగానే కదిరేశన్ దంపతుల కుమారుడా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.
కోర్టు ఆదేశించిన విధంగా ధనుష్ డిఎన్ఏ టెస్ట్ ను చేయించుకోనని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి అర్ధరహిత కేసు కోసం నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పడంతో.. అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ధనుష్ నిజం చెబుతున్నప్పుడు టెస్ట్ మాత్రం చేయించుకోవడానికి ఎందుకు భయపడుతున్నాడు..? ఫైనల్ గా ఈ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో.. చూడాలి!