ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. కెనడా మార్ఖమ్ నగరంలో ఒక వీధి పేరును ఏఆర్ రెహమాన్‌గా మార్చింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా రెహమాన్ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, కెనడాలో వీధికి సంగీత దర్శకుడి పేరు పెట్టడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2013లో ఏఆర్ రెహమాన్ పేరుపెట్టారు.
ఈ స్వర మాంత్రికుడి పాటలకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్స్ ఉన్నారు. సంగీత కచేరీలకు దేశ విదేశాలలో విశేష ఆదరణ లభిస్తుంటుంది. కెనడాలో ఏఆర్ రెహమాన్‌కు కెనడాలో మంచి ఆదరణ ఉన్నది. ఏఆర్ రెహమాన్ తమిళంలో కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందుదు కాడు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించగా.. చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ సందర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఒక స్టేట్ మెంట్ జారీ చేశారు. కెనడా ప్రజల పట్ల కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. ‘నేను నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. నిజంగా మీ అందరికీ, మార్కమ్ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టి, కౌన్సిలర్లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ (అపూర్వ శ్రీవాస్తవ), కెనడా ప్రజలకు కృతజ్ఞుడిని.
ఏఆర్ రెహమాన్ అన్న పేరు నాది కాదు. దీనర్థం దయాగుణం. మనందరి ఉమ్మడి దేవుడి గుణం. దీనికి మనం సేవకులం. కనుక ఈ పేరు ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కెనడా ప్రజలకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి దీవెనలు ఉండాలి. భారత్ లో నా పట్ల ప్రేమ చూపించే నా సోదరులు, సోదరీమణులకు సైతం నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతో సృజనాత్మకత కలిగిన వారు నాతో కలసి పనిచేసి నన్ను వందేళ్ల సినిమా ప్రపంచంలో సెలబ్రిటీని చేశారు. కానీ, నేను ఈ సముద్రంలో చిన్న బిందువును. విశ్రాంతి తీసుకోకుండా మరింత సేవ చేయాలని, స్ఫూర్తినీయంగా ఉండాలని నాపై బాధ్యతను ఇది పెంచింది’’ అని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.