HomeTelugu Big StoriesAllu Arjun లిక్కర్ కొన్నది ఎవరి కోసమో తెలుసా?

Allu Arjun లిక్కర్ కొన్నది ఎవరి కోసమో తెలుసా?

Allu Arjun viral video in Liquor shop:

Can You Guess Who Allu Arjun Surprised with Liquor?
Can You Guess Who Allu Arjun Surprised with Liquor?

నా పేరు శివ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఒక టీ షర్ట్ వేసుకుని ఒక లిక్కర్ షాపులోకి వెళ్లి ఏదో అడిగినట్లు కనిపిస్తుంది. కానీ షాప్ వాళ్ళు లేదు అని చెప్పడంతో బన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ ఈ వీడియో గురించి క్లారిటీ ఇచ్చేశారు.

“అప్పుడు నేను నా పేరు శివ షూటింగ్ చేస్తున్నాను. నా స్నేహితుడు నాతో ఉన్నాడు. అతని పేరు సందీప్ రామినేని. అతను మీకు వీరాభిమాని. ఎంత అంటే అతని చేయి కోస్తే కూడా పసుపు రంగు రక్తం వస్తుందేమో. ఆ రోజు తను నన్ను కలవడానికి వస్తున్నాడు. నేను ఏరా ఏం కావాలి అని అడిగితే తను ఒక బ్రాండ్ చెప్పాడు. నేను అసలు సినిమా సమయంలో తాగను. నా గురించి తెలిసిన ఎవరైనా ఈ మాటే చెబుతారు. కాబట్టి నేను డ్రైవర్ కి చెప్పాను ఆ బ్రాండ్ ఉందో లేదో కనుక్కోమని. కానీ అతను కొత్త వాడు కావడంతో సరిగ్గా అడగట్లేదు. ఇంక చిరాకు వచ్చి నేనే దిగి వెళ్లి అడిగాను. తర్వాత నాకు తట్టింది అరే నువ్వు నా ఫ్రెండు.. నేను సెలబ్రిటీని. నువ్వు నాకేం చెప్పాలి.. నువ్వు తీసుకోవద్దు.. ఇది గోవానే కదా నేను ఎక్కడో అక్కడ ఆగి తీసుకొని వస్తాను. అని చెప్పాలి. అసలు నీలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు” అంటూ దండం పెడుతూ నవ్వేసాడు అల్లు అర్జున్.

అంతేకాకుండా అతడిని స్టేజి మీదకి కూడా పిలిచాడు. ఆ వ్యక్తి వేదిక మీదకి వచ్చి బాలయ్య కాళ్లు మొక్కగా పక్కన నుండి “ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే ఇలాంటి న్యూస్ లు బోలెడు వస్తాయి సార్” అని అన్నారు.

అక్కడే బాలయ్య అతనిని బన్నీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పమనగా “మార్కెట్లో డబ్బులు మేకింగ్ మిషన్ అమ్ముతున్నారు అంటే నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడు. అప్పుడు నేను తన దగ్గర ఉన్న బుక్స్, క్యారేజ్, వాటర్ బాటిల్ అన్నీ అమ్మించేసాను. అమ్మేసి మార్కెట్ కి వెళ్లి ప్రతి షాప్ లోను ఇక్కడ డబ్బులు చేసే మెషిన్ ఉందా అని అడుగుతుంటే అందరూ మనీ గేమ్స్ అన్ని చూపిస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. సాయంత్రం అయ్యేసరికి ఉన్న డబ్బులతో స్నాక్స్ తినేసాను కానీ ఆయన దగ్గర మాత్రం ఇంటికి వెళ్ళడానికి బుక్స్, క్యారేజీ, వాటర్ బాటిల్ ఏమీ లేవు” అని అంటే అల్లు అర్జున్ డబ్బులు వస్తాయి అని అన్నీ అమ్మేశాను సర్ అన్నాడు అల్లు అర్జున్. వెంటనే బాలకృష్ణ ఇలాంటి స్నేహితుడిని గుద్దాలి అంటే బన్నీ నిజంగానే అతనిని సరదాగా కొట్టి గట్టిగా హాగ్ చేసుకుని “వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సర్” అని అన్నారు. ఇలా మొత్తానికి చాలా ఏళ్లుగా వైరల్ అయిన బన్నీ వీడియో గురించి క్లారిటీ వచ్చేసింది.

ALSO READ: విడుదలకి ముందు Pushpa 2 కి ఎన్ని కష్టాలో!

Recent Articles English

Gallery

Recent Articles Telugu