ఏపీ ఉభయ సభల్లోనూ కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. పోలవరం సహా పలు అంశాలపై కాగ్ నివేదికలో ప్రస్తావించారు. కేంద్ర జల సంఘం డిపిఆర్‌ను ఆమోదించక ముందే హెడ్‌వర్క్స్ అప్పగించారని నివేదికలో తెలిపింది. దీనితో ఒప్పందాలు రద్దయి జాప్యం జరిగి ఖర్చు పెరిగిందని కాగ్ పేర్కొంది. గత 12 ఏళ్లలో 105601 ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు గానూ 4069 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని నివేదికలో తెలిపారు. పనులు మందకొడిగా సాగుతున్నాయని, విపరీతమైన జాప్యం జరుగుతోందని నివేదిక తెలిపింది. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోలేదని, పునరావాస పునర్నిర్మాణ కార్యకలాపాలపై పర్యవేక్షణ కమిటీలు నిర్దేశించినట్లు సమావేశం కాలేదని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించి నిబంధనలు అమలు జరగడం లేదని నివేదికలో పొందుపర్చారు.