HomeTelugu Trendingకేఫ్‌ కాఫీడే సీఎండీ సిద్ధార్థ కథ విషాదాంతం

కేఫ్‌ కాఫీడే సీఎండీ సిద్ధార్థ కథ విషాదాంతం

1 30
కేఫ్‌ కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ కథ విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నేత్రావతి నదిలో ఈ రోజు ఉదయం శవమై కన్పించారు. ఈనెల 29న సాయంత్రం నేత్రావతి నది వంతెనపై వెళ్తుండగా డ్రైవర్‌ను కారు పక్కకు నిలపాలని సిద్ధార్థ సూచించారు. వంతెనపై నడుస్తూ సాయంత్రం 6:30వరకు ఫోన్‌లో మాట్లాడారు. కొద్ది సేపటి తర్వాత ఆయన కనిపించకపోవడంతో డ్రైవర్‌ ఆందోళన చెంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, డ్రైవర్‌ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచి మూడు పోలీసు బృందాలు ఓవైపు, ఎనిమిది పడవల సాయంతో గజ ఈతగాళ్లు, తీర ప్రాంత గస్తీదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మరోవైపు నేత్రావతి నదిలో గాలింపు చేపట్టాయి. నదిలో ఎనిమిదో స్తంభం వద్ద ఓ వ్యక్తి నీటిలో దూకడం చూశానని
స్థానిక జాలరి ఒకరు వెల్లడించినట్లు మాజీ మంత్రి యు.టి.ఖాదర్‌ తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నందున రక్షించే సాహసం చేయలేకపోయినట్లు ఆ జాలరి తెలిపారు.

ఎన్నో ఆశలతో కాఫీడే సామ్రాజ్యాన్ని స్థాపించినా, అనుకున్న విజయాన్ని సాధించలేకపోయానని ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన సంస్థల్లో సుమారు 30 వేల మందికి ఉపాధి కల్పించానని, ఆర్థిక నష్టాలు తీవ్రంగా కదిలించాయని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను విభాగం ఉన్నతాధికారి వేధింపులతో విసిగిపోయానని ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేఫ్‌ కాఫీ డేను స్థాపించి భారతీయ కాఫీకి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించడంతో సిద్ధార్థ కార్పొరేట్‌ ప్రపంచానికి సన్నిహితుడయ్యారు. బెంగళూరు సహా దేశ, విదేశాల్లో కాఫీ డే విక్రయ కేంద్రాలను స్థాపించారు. చిక్‌మగలూర్‌ జిల్లాలో దాదాపు 12 వేల ఎకరాల కాఫీ తోటల్ని నిర్వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu