HomeTelugu Trendingబుట్టబొమ్మా వీడియో సాంగ్‌..

బుట్టబొమ్మా వీడియో సాంగ్‌..

1 7
‘అల వైకుంఠపురములో..’ని ‘బుట్టబొమ్మా బొట్టబొమ్మా..’ అంటూ శ్రోతల్ని ఊపేస్తున్నపాట వీడియో టీజర్‌ వచ్చేసింది. స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ స్టెప్పులు, ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందం, కలర్‌ఫుల్‌ విజువల్స్‌ పాటలకు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. ‘మీకు బుట్టబొమ్మ పాట, విజువల్స్‌, నా స్టెప్పులు నచ్చుతాయని ఆశిస్తున్నా. పూర్తి పాటలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. జనవరి 12న థియేటర్‌లో కలుద్దాం..’ అంటూ ఈ వీడియోను బన్నీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ పాట విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 4.6 లక్షలకుపైగా వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. 64 వేల మంది లైక్‌ చేశారు. తమన్‌ బాణీలు అందించిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు.

‘అల వైకుంఠపురములో..’ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ నిర్మాతలు. టబు, నివేదా పేతురాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, జయరాం, సుశాంత్‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, నవదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!