సీనియర్ నటుడు భాను చందర్ తనయుడు జయంత్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వంలో కలపటపు లక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
నిర్మాతలలో ఒకరైన లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. ”మా బ్యానర్ లో తొలి సినిమా ఇది. పూర్తి కామెడీ జోనర్ లో తెరకెక్కిస్తున్పట్టికీ ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సినిమా ద్వారా సమాజానికి చిన్న సందేశాన్ని కూడా అందజేస్తున్నాం. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందని” అన్నారు.
మరో నిర్మాత లంకల పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ”సినిమా నిర్మాణంతో పాటు ఓ పాత్ర కూడా పోషించాను. ఇదే బ్యానర్ లో మరో రెండు సినిమాలు తెరకెక్కించనున్నాం” అన్నారు.
చిత్ర దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ”నిర్మాతలు నా కథను ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒకే చేశారు. సినిమాలంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. వాళ్లందరి కహకారంతో మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలిగాను. సినిమా కథ.. అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు జర్నీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఈ ప్రయాణంలో డిఫరెంట్ క్యారెక్టర్లు పరిచయమైతే ఎలా ఉంటుంది? జర్నీలో టైమ్ పాస్ కోసం రకరకాల టాపిక్స్ పై మాట్లాడుకుంటుంటా. మా కథలో కడా అలాంటి అంశాలే ఎలా హైలైట్ చేశామన్నది ఆసక్తికరం. ప్రస్తుత రాజకీయాలపై సెటైరికల్ కామెడీని ట్రై చేశాం. చింతామణి, కనక మహా లక్ష్మీ పాత్రల్లా ఈ క్యారెక్టర్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది” అని చెప్పారు.
హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మాట్లాడుతూ.. ”కొత్త బంగారులోకం, రైడ్, కాస్కో సినిమాల తర్వాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువర్ణ సుందరి పాత్రలో ఓ సెలబ్రిటీ గా నటిస్తున్నా. రొమాంటిక్ సినిమా కాదిది. సమాజంలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్ల వ్యక్తిత్వాలు..ఆలోచనా విధానం ఎలా ఉంటుందనే అంశాలను హైలైట్ గా కనిపిస్తాయి. సమాజాన్ని చైతన్య పరిచే విధంగా సందేశాత్మకంగా ఉంటుంది” అన్నారు.