HomeTelugu Trendingప్రేమంటే ఏమిటో నీవల్లే తెలిసింది

ప్రేమంటే ఏమిటో నీవల్లే తెలిసింది

5 2

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరి వల్ల తనకి ప్రేమంటే ఏమిటో తెలిసిందని అన్నారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అయాన్‌, అర్హ జన్మించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం అయాన్‌ 6వ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ”ప్రేమంటే ఏమిటి?’ అనే విషయం గురించి నేను ఎప్పుడూ ఆలోచించేవాడిని. గతంలో నేను గొప్ప ఫీలింగ్స్‌ను చవిచూశాను.. ఆ ఫీల్సింగ్స్‌ ప్రేమో కాదో నాకు కచ్చితంగా తెలియదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకు ప్రేమంటే ఏమిటో తెలిసింది. నువ్వే ప్రేమ. ఐ లవ్‌ యూ అయాన్‌. హ్యాపీ బర్త్‌డే మై బేబీ’ అని బన్నీ పోస్ట్‌ పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu