వరుస రికార్డు చిత్రాలతో రేసుగుర్రం లా దూసుకుపోతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా,
తెలుగు, తమిళం లో తిరుగులేని స్టైలిష్ మేకర్ గా గుర్తింపుపొందిన జ్ఙానవేల్ రాజా నిర్మాతగా,
సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్-12 గా
తెలుగు, తమిళ భాషల్లో రూపోందుతున్న చిత్ర వివరాలు ఈ రోజు చెన్నై లో పాత్రికేయుల
సమావేశంలో తెలిపారు. 2016 సమ్మర్ లో సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో రికార్డులని
తన ఖాతాలో వేసుకోవటమేకాక 2016 బెస్ట్ కమర్షియల్ చిత్రం గా ఇప్పటికి చెరగని రికార్డులతో
ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్
18 వ చిత్రం గా స్టూడియోగ్రిన్ 12 చిత్రం గా తెరకెక్కనుంది. ఇప్పటికే తెలుగు, కన్నడ,
మలయాళ బాషల్లో వరుస విజయాలతో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టైలిష్
స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంతో తమిళం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే భారీ క్రేజ్ ని సొంతం
చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వివరాలు ఈ రోజు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, నిర్మాత జ్ఙానవేల్ రాజా,
దర్శకుడు లింగుస్వామి పాత్రికేయులకి తెలియజేశారు. అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీ
ఇవ్వడంపై సీనియర్ యాక్టర్ శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్
తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకుంటారని ఆశించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ…. నాకు చెన్నై గా పేరు మారకుముందు నుంచి అంటే మద్రాస్
తో ఎంతో అనుబంధం ఉంది. నాకు లోకల్ ప్లేస్ లాగే అనిపిస్తుంది. నన్ను మీరు స్థానికుడిగా
భావించొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తమిళంలో ఎంట్రీ ఇచ్చే విషయంలో
చాలా ఆలోచించాం. ఓ మంచి డైరెక్టర్ ద్వారానే ఇంట్రడ్యూస్ కావాలనుకున్నాను. నన్ను
తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న లింగుస్వామికి, జ్ఞానవేల్ రాజాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
తెలియజేస్తున్నాను. అని అన్నారు.
నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ…. చాలా రోజులుగా నేను ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాను.
అల్లు అర్జున్ ని తమిళంలో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం రావడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నాను.
అని అన్నారు. ఫిబ్రవరి ద్వితియార్థంలో లేదా మార్చి ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుంది.
ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ… నేను ఇప్పటివరకు కలిసిన స్టార్స్ లో మోస్ట్ ఎనర్జిటిక్,
హార్డ్ వర్కింగ్ స్టార్ అల్లు అర్జున్. చెన్నైలో చాలా మందికి అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్సులంటే
ఇష్టం. అందుకే ఆయనతో ఓ మంచి కథతో తమిళంలో సినిమా చేయాలనుకున్నాం. అలా
ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది. అని అన్నారు.