Bujji from Kalki:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా రోజుకి ఒక రికార్డు చొప్పున అన్ని రికార్డులను తిరగ రాస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద ముందుకు దూసుకు వెళ్తోంది. నాలుగవ రోజు కూడా అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించిన కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటే ఒక కార్ ఉంటుంది. అది ఒక రోబోటిక్ కార్. దాని పేరు బుజ్జి.
బుజ్జి, భైరవ (ప్రభాస్) ఎలా కలిశారు అనే కాన్సెప్ట్ మీద భైరవ అండ్ బుజ్జి అనే ఒక యానిమేషన్ వెబ్ సిరీస్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే సినిమా మొత్తం ప్రభాస్ తోనే ఉంటుంది బుజ్జి అనే కార్. ముఖ్యంగా బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో ఆ పాత్ర ప్రేక్షకులకి ఇంకా బాగా నచ్చేసింది.
అలా విడుదల కి ముందు నుంచే బుజ్జి పాత్ర మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల పేరుతో చిత్ర బృందం బుజ్జి కార్ ని రియల్ గా బయటకు తీసుకువచ్చింది. తాజాగా ఇప్పుడు బుజ్జి విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్ లో ప్రత్యక్షమైంది. దానిని చూడటానికి ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చారు.
అందరూ బుజ్జిని ముట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. మాల్ బయట కనిపించినా బుజ్జి చుట్టూ జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. అందరూ బుజ్జి తో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు.
విడుదల కి ముందు మాత్రమే కాదు సినిమా విడుదల అయ్యాక కూడా బుజ్జి మీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ కారణంగానే బుజ్జి పాత్ర ఇంత బాగా క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు.
Bujji from Kalki:
సినిమా విడుదల కి ముందే బుజ్జి చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో హల్చల్ చేసింది. ముంబైలో జూహూ బీచ్ లో ఉన్న బుజ్జి కార్ ఒక పోలీస్ ఆఫీసర్ డ్రైవ్ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ మధ్యనే కాంతారా స్టార్ రిషబ్ శెట్టి కూడా బుజ్జిని డ్రైవ్ చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. మొత్తానికి కల్కి సినిమాతో బుజ్జి లాంటివి రోబోటిక్ కార్ కి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.