ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బేతంచెర్ల గ్రామంలో సంపన్న రాజకీయ కుటుంబంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బళ్లారి లోని విజయనగర ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం నందు బీటెక్ పూర్తి చేశారు. ఐతే, బుగ్గన రాజకీయాల్లోకి రాకముందు మైనింగ్ , సాఫ్ట్ వేర్ మరియు ఇతరత్రా వ్యాపారాలను నిర్వహించారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. బేతంచర్ల ప్రాంతంలో వీరి కుటుంబం ప్రముఖ రాజకీయ కుటుంబం. తండ్రి రామనాథ రెడ్డి బేతంచర్ల గ్రామానికి రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచర్ల గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. బేతంచర్ల మండల రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్ కుటుంబానికి వ్యక్తిగతంగా వీరాభిమానిగా పేరొందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019 లలో డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2016 -19 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా , 2019 నుంచి ప్రస్తుతం వరకు ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్థిక మరియు అసెంబ్లీ వ్యవహారాల విభాగాల్లో మంచి పట్టుందని ప్రత్యర్థి పార్టీ నేతలు మరియు రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికు వ్యక్తిగతంగా మంచి పేరున్నప్పటికీ.. రాజకీయ నాయకుడిగా ఆయన గ్రాఫ్ బాగా పడిపోతూ వస్తోంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బుగ్గన