ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా మొదలైంది. సినిమాల్లో కంటే డిజిటల్ మీడియాలో ఎక్కువ లాభాలు ఉన్నాయని తెలిసి వారిపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఆధారంగా ఇప్పుడు వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శివగామిగా ఎవరు నటిస్తారనే విషయంలో స్పష్టత రానప్పటికీ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సిరీస్ కోసం దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా దక్షిణాదిలో వెబ్ సిరీస్ కు ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడం ఇదే తొలిసారి కావొచ్చు. 14 ఎపిసోడ్లుగా ఈ సినిమా రాబోతుంది. అంటే దాదాపు ఒక్కో ఎపిసోడ్ కు 50 లక్షలకు పైనే ఖర్చు పెడుతున్నారన్నమాట. ఈ మొత్తంతో ఒక చిన్న సినిమాను నిర్మించొచ్చు. ఆర్కా మీడియా
నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ను దేవకట్టా డైరెక్ట్ చేస్తున్నారు.