టాలీవుడ్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ క్రైమ్ కామెడీ సినిమా ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ కానుంది. శ్రీవిష్ణు హీరోగా నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఏడు కోట్ల బడ్జెట్టుతో నిర్మించారు. బాక్సాఫీసు వద్ద 20 కోట్లు వసూలు చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడీ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తీసుకున్నారు. అజయ్ దేవగణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ హిందీ రీమేక్ లో సన్నీ డియోల్ తనయుడు కరణ్ డియోల్, సన్నీ కజిన్ అభయ్ డియోల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. దేవన్ ముంజల్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి హిందీలో ‘వెల్లీ’ అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.