Game Changer Breakeven Collections:
కొత్త సంవత్సరం ఆల్రెడీ మొదలైపోయింది. సినిమా అభిమానులు ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమాలపై ప్రేక్షకులకి భారీ అంచనాలు నెలకొన్నాయి.
మూడిట్లో ముందు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కి సిద్ధం అవుతుంది. పుష్ప 2 క్రేజ్ కొంచెం తగ్గాక కూడా తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల అవ్వలేదు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత వస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా Game Changer కావడం ఈ సినిమాకి బాగానే ప్లస్ అవ్వనుంది.
మరోవైపు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు కూడా సంక్రాంతి బరిలో దిగనున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ జనవరి 12న విడుదలకి సిద్ధం అవుతూ ఉండగా సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. మూడు సినిమాల మధ్య కేవలం రెండు రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.
View this post on Instagram
అయితే ఈ మూడిట్లో ఏ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు దాటి హిట్ అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూడు సినిమాల బ్రేక్ ఈవెన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. సంక్రాంతికి వస్తున్నాం తెలుగు వర్షన్ 55 కోట్ల బ్రేక్ ఈవెన్ ను దాటాల్సి ఉంది. డాకు మహారాజ్ తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ 83 కోట్లు.
ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 165 కోట్లు. మిగతా రెండు సినిమాలతో పోలిస్తే గేమ్ చేంజర్ టార్గెట్ చాలా ఎక్కువ.
పైగా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న మొదటి సినిమా కూడా ఇదే. సినిమాకి మంచి టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అంత కష్టం కాదు. కానీ ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చి మిగతా రెండు సినిమాలలో ఒకదానికి సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా.. అవి గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఈ మూడు సినిమాలు టార్గెట్ రీచ్ అవుతాయో లేదో వేచి చూడాలి.
ALSO READ: Comedian Ali నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!