ఫరూక్ రాయ్ డైరెక్షన్‌లో రూపొందించిన బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి ఫీచర్ ఫిలిం విడుదలయింది. ఇందులో ప్రధాన పాత్రల్లో అనిరుధ్ సమీర్, సిమ్రాన్ చౌదరి(ఈ నగరానికి ఏమైంది ఫేం) నటించారు. బ్రాహ్మణుల అమ్మాయి, నవాబుల అబ్బాయి కలిసి చేసిన ప్రయాణాన్ని అందంగా చిత్రీకరించాడు ఫరూక్ రాయ్.
అందమైన పల్లెటూరిలో బ్రాహ్మణుల కుంటుంబానికి చెందిన సంప్రదాయమైన అమ్మాయి లక్ష్మి. ఈమెను తన తండ్రి అమ్మగా భావిస్తాడు. లక్ష్మి తన చూట్టు ఉండేవారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఆమె ఒక ముస్లిం అమ్మాయికి సహయం చేస్తుంది. లక్ష్మి హైదరాబాద్ నగరానికి వెళుతుంది. హైదరాబాద్ నగరంలో ఓ నవాబుల అబ్బాయి కూడా ఇలానే తన చుట్టూ ఉన్నవారికి సహాయం చేస్తుంటాడు. ఓ హిందు ఆటో డ్రైవర్‌కు తన స్థాయికి మించి సహయం చేస్తాడు ఆ అబ్బాయి.
కాగా లక్ష్మి ఓ బస్టాప్ లో నిల్చుని ఉండగా ఒక వ్యక్తి తూలుతూ.. నడవడం చూసి తనకు కళ్లు తిరుగుతున్నాయేమోనని భావించి నీళ్ళు ఇవ్వబోతుండగా యాక్సిడెంట్‌కు గురవుతుంది లక్ష్మి. ఆ సమీపంలోనే ఉన్న నవాబుల అబ్బాయి ఆమెను హస్పిటల్ కు తీసుకువెళతాడు.. అతడికి ఓ ఆటో డ్రైవర్ సహాయం చేస్తాడు.. ఈ సినిమా ప్రేమ కథ లేక సందేశ్మక చిత్రమా..? లక్ష్మి బతుకుతుందా..? ఈ అబ్బాయి ఎవరు..? లక్ష్మి సాయం చేసిన అమ్మాయికి ఈ కథకు సంబంధం ఏమిటి..? ఈ సంఘటన లక్ష్మి తల్లిదండ్రుల్లో ఎటువంటి మార్పు తీసుకువచ్చింది.? ఈ కథలోని సారాంశం ఏమిటో తెలియాలంటే ఈ నవాబుల అబ్బాయి బ్రహ్మణుల అమ్మాయి ‘అభ్యంతరం ఏమిటి’ ఫీచర్ ఫిలిం చూడాల్సిందే..