100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ద్వారా తెలుగు సినీ చరిత్రలో కలకాలం నిలిచిపోయే పేరు తెచ్చుకున్న నందమూరి బాలయ్య.. తన 101వ సినిమాకి డైరెక్టర్‌గా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంపై ఆలోచనలో పడిపోయారు. కృష్ణవంశీ, కేఎస్ రవికుమార్, ఎస్వీ కృష్ణా రెడ్డి చాలా పేర్లు వినిపించినా.. సడన్‌గా పూరీ కథకు ఓకే చెప్పడం వెనుక బాలయ్య తనయ బ్రాహ్మణి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఈ మధ్య తన తండ్రి కోసం వచ్చిన కథలు కూడా బ్రాహ్మణి శ్రద్దగా వింటోందని తెలుస్తోంది. నిజానికి 101వ సినిమా ఎస్ వీ కృష్ణారెడ్డితోనే చేయాల్సింది.
అన్నీ కుదిరిపోయి సినిమా ఓపెనింగ్ కు ఏర్పాట్లు చేస్తోన్న తరుణంలో బాలయ్యను, పూరి సంప్రదించడం.. కృష్ణారెడ్డి కథ కంటే పూరి చెప్పిన కథ బెటర్ గా అనిపించడంతో పూరి వైపే మొగ్గు చూపారు. అలాగే బాలయ్య కుమార్తె బ్రాహ్మణి సలహాలను వినడం వల్ల… కృష్ణారెడ్డి కథని పక్కన పెట్టారని సమాచారం. మరి భవిష్యత్తులో కూడా బ్రాహ్మణి సలహాను బాలయ్య తూచ తప్పకుండా పాటిస్తాడేమో చూడాలి!