టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్య ను సిద్ధార్థ పెళ్లి చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, ఉపాసన, మంచు ఫ్యామిలీ తో పాటు తదితరులు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులన్న విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఐశ్వర్య వృత్తి పరంగా డాక్టర్ అని తెలుస్తోంది.