HomeTelugu Trending'కన్నప్ప'లో జాయిన్‌ అయిన కమెడియన్‌లు

‘కన్నప్ప’లో జాయిన్‌ అయిన కమెడియన్‌లు

brahmanandam surekha vani i

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్‌ ప్రొజెక్ట్‌ ‘కన్నప్ప’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేశాడు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార పార్వతీగా కనిపిస్తుందనే వస్తున్నాయి. వాటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

రెండ్రోజుల క్రితం కన్నప్ప షూటింగ్‌లో మంచు విష్ణు షూటింగ్‌లో గాయపడ్డాడని, డ్రోన్ వచ్చి మంచు విష్ణు చేతికి తగిలిందని దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే మంచు విష్ణు క్షేమంగా ఉన్నాడని, కంగారు పడాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్యం గురించి యోగక్షేమాల గురించి ఆరా తీసిన ప్రతీ ఒక్కరికీ, ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని మోహన్ బాబు ట్వీట్ వేశాడు.

శివ బాలాజీ సైతం కన్నప్ప షూటింగ్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా సురేఖా వాణి, బ్రహ్మానందం, రఘుబాబు, సప్తగిరి ఇలా కమెడియన్లంతా కూడా కన్నప్ప టీంలో సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. కన్నప్ప టీంలో జాయిన్ అయినందుకు సంతోషంగా ఉందంటూ సురేఖా వాణి షేర్ చేసిన ఫోటో, అందులో మోహన్ బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక కన్నప్ప టీం ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేలా ఉంది.

సురేఖా వాణి సైతం గత వారం రోజుల నుంచి న్యూజిలాండ్‌లోనే సందడి చేస్తోంది. ఆమె కన్నప్ప షూటింగ్ కోసం వెళ్లిందని ఇప్పుడు ఇలా రివీల్ అయింది. ఇక కన్నప్పలో హీరోయిన్‌గా నుపుర్ సనన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇంకా హీరోయిన్‌ను ఫిక్స్ కాలేదని సమాచారం. కన్నప్పను మంచు విష్ణు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం సీరియల్ తీసిన డైరెక్టర్ ముకేష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu