HomeTelugu Trendingఅల్లు అర్జున్‌కి బ్రహ్మానందం గిఫ్ట్‌

అల్లు అర్జున్‌కి బ్రహ్మానందం గిఫ్ట్‌

Brahmanandam priceless giftహాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరికీ ఆయన నటన గురించి మాత్రమే తెలుసు కానీ చిత్ర లేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ లాక్‌డౌన్‌లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు ఎంతగానో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ సాహితీ ప్రియుడి కళా నైపుణ్యానికి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు ‘ఆంజనేయుని ఆనంద భాష్పాలు’ పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్‌ చాలామందిని ఆకట్టుకుంది.

తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కుంచెతో కాగితంపై సాక్షాత్కరించారు. దీన్ని గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టింది. ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు. స్వహస్తాలతో గీసిన ఈ డ్రాయింగ్స్‌ చూసి బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

THE MOST PRICELESS GIFT I RECEIVED FROM OUR BELOVED
BRAHMANANDAM GARU.
45 DAYS OF WORK .
HAND DRAWN PENCIL SKETCH . THANK YOU ❤ #AlluArjun #Pushpa @alluarjun pic.twitter.com/rkqY6D8FEi
— TelanganaAlluArjunFC (@TelanganaAAFc) January 1, 2021

Recent Articles English

Gallery

Recent Articles Telugu