పవన్ కల్యాణ్ సినిమా ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నటుడు బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే స్థాయి ఉన్న అతికొద్ది మందిలో నేను ఒకడినని నమ్ముతున్నాను. ఆయనకి 18 – 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నాను” అన్నారు.
పవన్ బ్రో సినిమాలో తాను ఒక చిన్న పాత్ర చేసినట్లు చెప్పారు. పవన్‌తో కలిసి నటించడం నా అదృష్టం. పవన్ కల్యాణ్ నవ్వితే పత్తికాయ విచ్చుకున్నట్టుగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆయన నవ్వు, మనసు కూడా అంతే తెల్లగా ఉంటాయి.
పవన్ కల్యాణ్‌లో ఏ వైపు నుంచి చూసినా మంచితనమే కనిపిస్తుంది. ఆయన ఒక దైవాంశ సంభూతుడు” అంటూ ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కల్యాణ్ విజయానికి అన్ని విధాలుగా తోడ్పడాలని అభిమానులను కోరుతున్నాను. ఈ నాలుగు మాటలు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అన్నారు.
‘మిస్టర్ బ్రో… ఐ లవ్ యు బ్రో.. ఏయ్ దొంగ, ఐ లవ్ యు డా’ అని బ్రహ్మానందం అంటుంటే పవన్ కళ్యాణ్ నవ్వేశారు.
బ్రో సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను కోరుకోకపోయినా అవుతుందని నాకు తెలుసు. ఈ వేదిక ద్వారా మరో సారి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అనడంతో సభలో నవ్వుల వాన కురిసింది.