
Brahma Anandam OTT:
తెలుగు సినీ ప్రేక్షకులకు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన లెజెండరీ కమెడియన్ మాత్రమే కాదు, తన హాస్యంతో అనేకరిని నవ్వించిన నటుడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన “బ్రహ్మ ఆనందం” అనే సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే, ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు ఈరోజే సినిమా చూడొచ్చు. మిగతా అందరికీ మాత్రం రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇది కొంతమంది ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయం అయినా, ఓటీటీలో ఎలా నడుస్తుందో వేచి చూడాలి.
#Aha Gold users can now watch Brahma Anandam exclusively on aha!@ahavideoin #BrahmaAnandamonaha pic.twitter.com/dGLedryAtL
— Telugu Film Producers Council (@tfpcin) March 18, 2025
ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, కొన్ని సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందుతాయి. “బ్రహ్మ ఆనందం”కూడా అదే విధంగా హిట్ అవుతుందా? లేదా థియేటర్ లాగా మిశ్రమ స్పందనకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.
ఈ చిత్రంలో బ్రహ్మానందం తాత పాత్ర పోషించగా, ఆయన మనవడిగా రాజా గౌతమ్ నటించారు. ఇందులో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, సంపత్, రాజీవ్ కనకాల, తల్లూరి రాజేశ్వరి కీలక పాత్రలు పోషించారు.
రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ సినిమాకు సాందిల్య పిసపాటి సంగీతం అందించారు. ఇక దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్, ఈ సినిమాను వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కించారు.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరి దృష్టి “బ్రహ్మ ఆనందం” ఓటీటీలో ఎలా రాణిస్తుందనే విషయంపై ఉంది. బ్రహ్మానందం కమెడీ టైమింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమా కథ, ఎమోషన్లు, హాస్యం ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి!