బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5న) డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైన విషయం తెలిసిందే! ఇందులో ఆలియా తన భర్తను చిత్రహింసలు పెట్టింది. తనను ఇంట్లోనే నిర్బంధించి, కొడుతూ టార్చర్ పెట్టినట్లుగా చూపించారు. ఇంకేముందీ.. పురుష సమాజం ఒక్కసారిగా మండిపడింది. పురుషులపై గృహహింసను ప్రోత్సహించేలా ఉన్న ఈ సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమానే కాదు, ఆలియా భట్‌ను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో #BoycottAliaBhatt, #BoycottDarlings హ్యాష్‌ట్యాగ్‌లను చేస్తున్నారు.
నిజానికి ట్రైలర్‌లో.. పెళ్లి తర్వాత తననెలా చిత్రవధ చేశాడో తను కూడా అతడిని అలాగే ట్రీట్ చేసి ప్రతీకారం తీర్చుకుంటానంది హీరోయిన్. అంటే ముందుగా తాను కూడా గృహహింస బాధితురాలినేని వెల్లడించింది. కానీ నెటిజన్లు మాత్రం అలా ప్రతీకారం తీర్చుకోవడం సరికాదని అభిప్రాయపడుతుండటం గమనార్హం. మగవారిని హింసించడం మీకు సరదాగా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆలియా భట్ మరో అంబర్ హెరాల్డ్‌లా మారిందంటూ అసహనానికి లోనవుతున్నారు. బాయ్‌కాట్ డార్లింగ్స్, బాయ్‌కాట్ ఆలియా భట్ ట్రెండ్‌తో ట్విటర్ హోరెత్తిపోతోంది. మరి ఈ వివాదంపై ఆలియా ఎలా స్పందిస్తుందో చూడాలి!
Alia Bhatt has produced a movie called #DarlingsOnNetflix to promote domestic violence against men.#BoycottDarlings
Results of doing this
👇👇👇👇 pic.twitter.com/zisEdoYBAf— MenToo (@MenTooSave) August 3, 2022
#BoycottAliaBhatt who is endorsing DV on Men.
Imagine if the genders were reversed! pic.twitter.com/OK4EDAe3pS
— Catachi (@itachi_senpai1) August 3, 2022
As if being a Nepo kid wasn’t enough, she produced and acted in a Movie that makes Fun of Male Victims of Domestic Violence.
With so much bias against Male Victims, this movie fuels it by saying:
“Male Victims of DV must have done something to deserve it”#BoycottAliaBhatt pic.twitter.com/QkmLvaXsbl
— Catachi (@itachi_senpai1) August 3, 2022