మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ బ్యానర్ పై ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. 2019 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో బోయపాటి శ్రీను పేరు వినిపిస్తోంది. గతంలో మహేష్-బోయపాటి కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని వార్తలు వినిపించాయి. అయితే ఈసారి మాత్రం ఈ కాంబో సెట్స్ పైకి వెళ్ళడం పక్కా అంటున్నారు.
ఇటీవల 14 రీల్స్ వారు మహేష్ తో మంచి మాస్ సినిమా చేయాలని బోయపాటిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే బోయపాటి మాత్రం ఎందుకు వద్దనుకుంటాడు. ఇక మహేష్ కు మంచి స్టోరీ రెడీ చేయడమే ఆలస్యం.. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు.
‘ఆగడు’ సినిమా సమయంలో 14 రీల్స్ వారికి ఆర్థికంగా నష్టాలు రావడంతో మహేష్ ఈ బ్యానర్ లో సినిమా చేస్తానని
అంగీకరించాడు. ఈ క్రమంలోనే బోయపాటితో సినిమా చేయనున్నాడని టాక్.