నందమూరి బాలకృష్ణ .. డైరెక్డర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ చిత్రాలు సంచలనం సృష్టించన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో కోసం అభిమానులు ఆస్తకి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మరో హిట్ కోసం సిద్ధమైయ్యారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను నిర్వహించిన ఈ ఇద్దరూ త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నారు.
ఈ సినిమాలోను బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా పవర్ఫుల్ గా మలిచాడట. కథను.. బాలకృష్ణ పాత్రను దృష్టిలో పెట్టుకుంటే ‘ఐకాన్’ అనే టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని బోయపాటి భావించినట్టుగా సమాచారం. ఈ టైటిల్ ‘దిల్’ రాజు దగ్గర వుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఆయన ఈ టైటిల్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అందువలన బోయపాటి ఆ టైటిల్ కోసం ‘దిల్’ రాజును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.