కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట. సూర్యకు బోయపాటి లైన్‌తో పాటు కొంత కథ చెప్పారట. హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో బౌండ్ స్ర్కిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డారట. సూర్య నేరుగా తెలుగు తొలి సినిమా ఇదే కానుంది. తెలుగు-తమిళ ద్విభాషా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. అలాగే, ఇతర దక్షిణాది భాషల్లోనూ… హిందీలోనూ అనువదించి విడుదల చేసే ఆలోచన ఉందట.
ఇకపై తీయబోయే చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో చేసేలా బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. తన సినిమాల్లో మాస్‌తో పాటు కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. ఆయన తీసిన చిత్రాలు కొన్ని ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో అనువాదం కాగా మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆయనే ఇతర భాషలకు వెళ్లాలని అనుకుంటున్నారు.