HomeTelugu Trendingబోయపాటితో రామ్‌ సినిమా ఫిక్స్‌

బోయపాటితో రామ్‌ సినిమా ఫిక్స్‌

Boyapati movie with ram

బోయపాటి డైరెక్షన్‌లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రామ్ హీరోగా సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనంటూ కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా అయితే, హీరోగా రామ్ కి ఇది 20వ సినిమా. ప్రస్తుతం రామ్ లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu