HomeTelugu Newsబోయపాటి కొత్త చిత్రం ప్రారంభం కానుంది!

బోయపాటి కొత్త చిత్రం ప్రారంభం కానుంది!

శ్రీ అభిషేక్ పిక్చర్స్ సంస్థ అధినేత అభిషేక్ నామా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించనున్న సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సంధర్భంగా… నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ”బోయపాటి మార్క్ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. బెల్లంకొండ శ్రీనివాస్ కు సరైన కథ. ఈ సినిమా కోసం శ్రీను మేకోవర్ అవుతున్నాడు. లవ్, యాక్షన్ రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 4న పూజా కార్యక్రమాలతో ఘనంగా చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించనున్నాం. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu