Bigg Boss 8 Telugu Bottom 3 contestants:
బిగ్ బాస్ తెలుగు 8 ప్రయాణం చాలా ఆసక్తిని కలిగిస్తూ గ్రాండ్ ఫినాలే వైపు వేగంగా దూసుకుపోతోంది. షో డిసెంబర్ 15న ముగుస్తుందని భావించినా, తాజా సమాచారం ప్రకారం, ఫినాలీ తేదీ డిసెంబర్ 22కి పొడిగించబడినట్టు సమాచారం. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు, వారిలో ఎవరు టైటిల్ గెలుస్తారన్న ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది.
హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు:
1. నిఖిల్ మలయక్కల్
2. ప్రేరణ
3. గౌతమ్ కృష్ణ
4. టేస్టీ తేజ
5. విష్ణు ప్రియ
6. పృథ్విరాజ్
7. రోహిణి
8. అవినాష్
9. నబీల్ అఫ్రిదీ
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ షాకర్‌తో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. టేస్టీ తేజ, పృథ్విరాజ్, అవినాష్ ఈ వారం బాటమ్ 3లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, టేస్టీ తేజ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాడు. శనివారం అంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీనిని ప్రేక్షకులకు చూపిస్తారు.
ఆదివారం ఎపిసోడ్‌లో పృథ్వి లేదా అవినాష్ ఎలిమినేట్ అవుతారు. హౌస్‌లో ఈ రెండు ఎలిమినేషన్లు చివరి దశలో పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినా అతను ఫినాలీ స్పాట్ కోల్పోయి, పృథ్వి కి అవకాశం దక్కే అవకాశం ఉందని సమాచారం.
టాప్ 5లో చోటు దక్కించుకోవడానికి కంటెస్టెంట్లు కఠినమైన టాస్కుల్లో పోటీ పడుతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లు హౌస్ లో పరిస్థితులు పూర్తిగా మారతాయి. బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Bigg Boss 8 Telugu లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా?