HomeTelugu Trending'శ్రీదేవి బంగ్లా'ను ఆపేందుకు బోనీ కపూర్‌ చర్యలు

‘శ్రీదేవి బంగ్లా’ను ఆపేందుకు బోనీ కపూర్‌ చర్యలు

4 19ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శ్రీదేవి బంగ్లా’. టైటిల్‌తోనే సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అదీకాకుండా టీజర్‌లో అలనాటి నటి శ్రీదేవి బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయిన ఘటనను కాపీ కొడుతూ ప్రియా వారియర్‌ కూడా సినిమాలో అలాగే చనిపోవడాన్ని చూపించారు. దాంతో సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ దర్శకుడికి, నిర్మాతకు నోటీసులు పంపారు.

కానీ, ఈ నోటీసులపై వారు స్పందించలేదు. దాంతో సినిమా విడుదలను ఆపేందుకు బోనీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ చూసినప్పుడే బోనీ కపూర్‌ చిత్రబృందానికి నోటీసులు పంపారు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బోనీ నిర్ణయించుకున్నారు. సినిమాలో ఏ సన్నివేశాలను చూపించాలన్నది వారి ఇష్టం. కానీ టైటిల్‌లో మాత్రం శ్రీదేవి పేరు ఉండకూడదు’ అని బోనీ సన్నిహితులు తెలిపారు.

ఈ సినిమాపై వివాదాలు ఉన్నప్పటికీ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ ఇందులో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించారు. సినిమాకు, శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదన్న ధీమాతోనే నటించేందుకు అంగీకారం తెలిపానని ఆయన పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu