HomeTelugu NewsBoney Kapoor: స్టార్ హీరోయిన్ తో అసభ్య ప్రవర్తన..నెటిజన్లు ఫైర్

Boney Kapoor: స్టార్ హీరోయిన్ తో అసభ్య ప్రవర్తన..నెటిజన్లు ఫైర్

Boney Kapoor gets trolled Boney Kapoor,Priyamani,Maidaan,bollywood

Boney Kapoor: నటి ప్రియమణి టాలీవుడ్‌లో కూడా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. తెలుగులో ఎక్కువగా ఈ బ్యూటీ గ్లామర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి డిఫరెంట్‌ పాత్రలతో దూసుకుపోతుంది. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది.

ప్రియమణి బాలీవుడ్ లో నటించిన తాజా చిత్రం మైదాన్. అజయ్ దేవగన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా విడుదలైన పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా స్క్రీనింగ్ లో బాలీవుడ్ సెలెబ్రటీలు పాల్గొన్నారు. ప్రియమణి కూడా హాజరైంది.

జాన్వీ కపూర్ తండ్రి.. నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు. మైదాన్ మూవీ స్క్రీనింగ్ కి హాజరైన ఆయన ప్రియమణితో కలసి కెమెరాకి ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ప్రవర్తనపై నెటిజన్ల విమర్శలు చేస్తున్నారు. కెమెరాలకు ఫోజులు ఇచ్చే సమయంలో ఆయన ప్రియమణి నడుముని తడుముతూ కనిపించారు.
ఆ తర్వాత భుజంపై చేయి వేసి ఫోజులు ఇచ్చారు. భుజం పై చేతులు వేయడం పెద్ద తప్పేమి కాకపోవచ్చు. కానీ ఆయన నడుముపై చేయి వేయడంతో నెటిజన్లు మండి పడుతున్నారు. కూతురు వయసున్న నటితో ప్రవర్తించే విధానం అదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అది కూడా కెమెరాకు ఫోజులు ఇస్తూ పబ్లిక్ లో చీప్ గా బిహేవ్ చేస్తారా అని ట్రోల్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బోనీ కపూర్ పొరపాటున అలా చేయి వేసి ఉంటారని కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా బోనీ కపూర్ ఉండకూడని విధంగా వార్తల్లో నిలిచారు

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu